బాగా ఆకలిగా ఉంది.
కడుపు నింపుకోడానికి బయటకి వచ్చాను.
ఏంటో ఈ జన్మ.. ఈసారి గొప్పింట్లో పుట్టాలి.
దొంగతనంగా రోజూ కడుపు నింపుకోడం నచ్చలేదు.
ఓ ఇంట్లో Lights అన్నీ Off చేసి ఉన్నాయి.
ఈరోజుకి ఆహారం ఇక్కడే అనుకుని ఆ ఇంట్లో చొరబడ్డాను.
.
పైపు మీద నుండి పైకెళ్లాను..
Bedroom కిటికీ తీసే ఉంది.
కిటికీ నుండి లోపలికి వెళ్లగానే Shock అయ్యాను.
అతిలోక సుందరి, అప్సరస, అందానికే మరులుగొలిపే అందగత్తె నిద్రపోతోంది.
తన దగ్గరకి వెళ్లాను.
ఎర్రని శరీరం.. రక్తం ఎక్కువే!!
నాలో చిలిపి ఎక్కువయింది.
తమాయించుకుని తన బుగ్గమీద నా పెదవులు ఆనించాను. తను కదిలింది. పక్కకు లేచి ఇంకో బుగ్గమీద నా పెదవులు ఆనించాను. కాస్సేపు జుర్రుకున్నాను.
తను కదిలింది మళ్లీ..
ఈసారి కళ్లు తెరిచింది.
మంచం కింద దాక్కున్నాను.
.
కాస్సేపటికి బయటకి వచ్చాను.
తను దుప్పటి కప్పుకుని ఉంది.
ఏంచేయాలో అర్ధం కాలేదు.
నాలో ఆకలి ఎక్కువవుతోంది.
.
చిన్నగా దుప్పటి లోపలికి దూరి తన మీద వాలాను.
తను దుప్పటి తీసింది కానీ కళ్లు తెరవలేదు.
నేను నా ఆకలి తీర్చుకుంటూనే ఉన్నాను.
తను కదులుతూనే ఉంది.
నేను తన నుదుటి మీద ముద్దాడుతున్నప్పుడు తన చేయి వచ్చి నన్ను గట్టిగా తాకింది.
దెబ్బతో నా కళ్లు బైర్లు కమ్మాయి. కాస్సేపటికి నా ప్రాణం పోయింది. :( :(
.
.
.
.
ఏం.. మనుషులకేనా ఆత్మలుండేదీ.. దోమలకుండవా??
: )

No comments:
Post a Comment