Saturday, 12 March 2016

ఒక చిన్న కథ.




వేసవి కాలమంతా చీమ🐜 ఎండను లెక్క చేయకుండా కష్టపడి రాబోయే వర్షాకాలం కోసం ఆహారం సమ కూరుస్తుంది. అది చూసి "మిడత" నవ్వుతూ ఎగతాలి చేస్తుంది.. జాలి పడుతుంది. వేసవి కాలాన్ని బద్దకంగా గడుపుతుంది.
.
🌦🌨💨🌪🌨వానాకాలం వస్తుంది.చీమ పుట్టలో వెచ్చగా ఉంటుంది..తాను దాచిన ఆహరం తింటూ .. తన కష్టాన్ని.. ముందు చూపునూ.. తెలివినీ ఆనందంగా మార్చుకొని అనుభవిస్తూ ఉంటుంది.
.🍝🧀🍞
ఆకలి తో అలమటిస్తున్న మిడత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి... 🎤మిగతా అందరూ ఆకలికీ..చలికీ అలమటిస్తుంటే కేవలం చీమే ఇన్ని సౌకర్యాలు ఎందుకు అనుభవించాలి?? అని ఉద్యమంలేపుతుంది.🌋
.
🖥ఆటివి.. ఇటివి.. CNG TV..🖥 లాంటివన్నీ బుల్లి తెరని సగానికి చీల్చి.. వనుకుతున్న మిడతనూ.. చీమ తాలుకు భోజనం టేబిల్ నూ చెరోవైపూ చూపిస్తాయి.📡📡📺
.
ప్రపంచం నిర్ఘాంతపోతుంది.😮🙀
.
👉🏼క్రపాశ్ రకాత్ నిరాహార దీక్ష ప్రారంభిస్తాడు.
👉🏼చీమల పుట్ట ముందు హురాల్ మహాత్ముడు ధర్నా చేస్తాడు.
👉🏼ప్రైవేట్ ఎంక్వైరీ చేపిస్తా అని జిక్రేవాల్ చెప్తాడు.
👉🏼తాసీరాం చూరీ గారు వాకౌట్ చేస్తారు.
👉🏼మిడతలకి ప్రత్యేక హక్కులివ్వాలంటూ పది మందికి మెసేజిలు పంపితేనే మీకు మంచి జరుగుతుంది అని ఫోన్లలో మెసేజ్ ల వర్షం కురుస్తుంది..
👉🏼బీదవారిపై అన్యాయానికి నిరసనగా యామావతి విజృంభిస్తుంది.
.
👉🏼ధనవంతులైన చీమలకూ.. బీదవైన మిడతలకి మధ్య వర్గ వ్యత్యాసం తగ్గించేందుకు ఎండాకాలం లో చీమలు పని చేయకుండా బిల్లు ప్రవేశ పెట్టాలని మ్యూకనిస్ట్ లు డిమాండ్ చేస్తారు.
👉🏼లూలా ప్రసాద్ వచ్చి గరీబ్ రథ్ లా మిడతల రథం పెట్టాలనీ.. ఆ ఖర్చు కోసం తత్కాల్ చార్జీలు పెంచమంటాడు.
👉🏼విద్యాశాఖ మిడత లకు ప్రత్యేక రిజర్వేశన్ కల్పిస్తుంది.
👉🏼మిడతలకి అన్ని కాలాల్లో ఆహారం ఆల్ ఫ్రీ అని దంచ్రబాబు ఒకవైపు.... మిడతలకే కాదు.. అన్ని క్రిములకి అల్రెడీ ఇచ్చేసామని సికేఆర్ లు అంటారు.
👉🏼మిడతల కోసమే పార్టీ పెట్టానని బిహార్ సియ్యం చేతులు జోడిస్తాడు.
🏃🏼🏃🏼🏃🏼🏃🏼🏃🏼🏃🏼🏃🏼🏃🏼🏃🏼🏃🏼🕸చీమ మీద ఇంకమ్ టాక్స్ అధికారులు దాడీ చేసి ఆస్థులు స్వాధీన పర్చుకుంటారు.🕸
.
.
.
మిడతలు రక్షించబడినందుకు ధర్నాలు విరమించబడతాయి.
.
ఇది బలహీన వర్గాల విజయమని అయిదు నక్షత్రాల హోటల్ లో ప్రెస్ మీట్ లో హురాల్.. జీక్రేవాల్ లు అభివర్ణిస్తారు..

No comments:

Post a Comment