Wednesday, 16 March 2016

ఎందుకు ఇంతలా ప్రేమిస్తావు . . ? ? ?

నిజమనిపించే కలలతో నను సంతోష పెడతావు . . .
నిజమేమో అని నమ్మేలోగా కల అని తెలిపి కలవర పెడతావు . . .
నీడల్లే నీ తోడుంటానని నన్నే నువు నమ్మిస్తావు . . .
చివరికి నీడైనా నీ తోడుండదని నిజముని చెప్పి నొప్పిస్తావు . . .
మౌనంగా నే కూర్చుని ఉంటే నువు మాటలు కలిపి కవ్విస్తావు . . .
ఆ మాటలు నను ముంచేస్తుంటే నీ మౌనంతో నను బాదిస్తావు . . .
విరహంలో నను ఒంటరి చేసి ఎందుకు ఇంతలా వేదిస్తావు . .?
ఆవేదనలోను అండగ ఉంటూ నను ఎందుకు ఇంతలా ప్రేమిస్తావు . . ? ? ?

No comments:

Post a Comment