నిజాలు తెలుసుకోవడం కేంటే సినిమాలు, ధారావాహికలు చూసి తెలుసుకున్న అతి తెలివి ఎక్కువగా ఉంది.
సినిమాల్లో ఏ తలకమాసినవాడు ఏది చెబితే అదే నిజం అని నమ్మేస్తున్నారు. బావుంది. కాని సినిమాల్లో చెప్పిన అన్ని విషయాలు ఎందుకు ప్రయత్నించడంలేదు?
సినిమాలు చూసి ప్రేమ పేరుతొ తల్లిదండ్రుల ఆశలు నీరుగారుస్తున్నారు. అర్థంతరంగా తనువు కూడా చలిస్తున్నారు. సినిమాల్లో చూపించే కాలేజి గొడవలు యువత నేర్చుకుంటున్నారు. ధారావాహికల్లో చూపించే అత్తా కోడళ్ళ తగవులు చూసి అత్తా కోడళ్ళు కొట్టుకు చస్తున్నారు. తల్లిదండ్రులను పేర్లు పెట్టి పిలవడం, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను కించపరచడం చేస్తున్నారు. ఆస్తుల తగాదాలు, అన్నదమ్ముల గొడవలు చేస్తున్నారు. మరి! సినిమాల్లో చూపించే దేశభక్తి, తల్లిదండ్రులని గౌరవించడం లాంటి మంచిపనులు మాత్రం ఎందుకు చేయడంలేదు?
సినిమాల్లో నాటకీయత పెంచడం కోసం అనేకరకాల మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు అది సహజం ఎందుకంటే లక్షలు, కోట్లు పెట్టుబడి పెట్టినప్పుడు వాటిని తిరిగి రాబట్టుకోవాలి. అలా చేయకపోతే నిర్మాత నశానం అవుతాడు. మన ఇతిహాసాలు, పురాణాలు సినిమాలుగా మలిచారు ఆ తరం వారు. మూలం నుంచి ఒక కథ లేదా ఒక వ్యక్తిని తీసుకొని దానిని అత్యుత్తమంగా చూపించడానికి ఎన్నో మార్పులు చేస్తారు. దానిని చూసి మనం తప్పెట్లు, ఈలలు వేసి ఆ సినిమాలు వందరోజులు అడిస్తాం. దాంతో నిర్మాత లాభాలు వచ్చి నిలదొక్కుకొని మరొక సినిమా తీసుకుంటాడు. ఇది సినిమా సంప్రదాయం. ఇక్కడ ఎవరి ఆలోచనలు పొరబాటు కాదు. కాని మనం మాత్రం పొరబాటు పడుతున్నాం. తెరమీద చూసిన బొమ్మలు, వాటి కథలు నిజం అని నమ్మేసి వారిని ఆరాదిస్తున్నాం.ఇది ఎంతవరకు సైరైందో మీరే ఆలోచించండి.
ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే! నిన్న పెట్టిన కర్ణ వృత్తాంతం టపాకి వచ్చిన రిప్లయ్ లు చూస్తే సినిమాల్లో ఎంత మునిగిపోయారో అర్థం అవుతుంది. అంతేకాదు మూలం తెలుసుకోవడం కోసం ఒక్కడు కూడా ప్రయత్నించగ పోగా నిజాన్ని మీకు నచ్చినట్లు మార్చేసుకుంటున్నారు. కర్ణుడు లేనిదే భరతం లేదు ఇది నిజం. ఎందుకంటే కర్ణుడి పాత్ర స్నేహం కోసం అన్నట్లుగా ఉండి స్నేహితుడిని ధర్మం వైపు మార్చకపోగా దుర్యోధనుడికి అధర్మమే ఇష్టం అతడికి అదే చెబుతాను అని నిర్మొహమాటంగా చెప్పాడు.
మహాభారతం చదివినవారు, చదవని వారు ఒకసారి మూల మహాభారతం చదవండి. మనస్సు పెట్టి అసలు మహాభారతంలో ఏమి ఉందొ చదివితే అర్థమౌతుంది. ఇదేదో ఒక పుస్తకం చదివేసి పనైపోయింది అనుకొనేది కాదు. లక్ష పై చిలుకు శ్లోకాలు ఉన్న గ్రంథం.. కనీసం చదవడానికే మూడు నెలలు పైన పడుతుంది. అవగాహనా చేసుకుంటూ చదివితే ఎంతకాలం పడుతుందో చదివేవారికే తెలియాలి. నాకైతే రెండు సంవత్సరాల కాలం సరిపోలేదు.
No comments:
Post a Comment