Saturday, 12 March 2016

కుల పిచ్చి

కుల రాజకీయ చిచ్చు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కొంత, ఓటు రాజకీయాలు కొంత, వీటివలన జనాలలో సమతూకం దెబ్బతిని, దళితులం అని కొందరు, మాదిగ దండోరా అని కొందరు ఆందోళనలు చేస్తే, ఇప్పుడు కాపు గర్జన అని విధ్వంస కాండ సృష్టించి ప్రభుత్వ ఆస్తులకే ఎసరు పెట్టారు. వీటివలన దెబ్బతినేది ఎవరు అంటే సామాన్య జనం,
వీరికి వీరు ఆందోళనలు, విధ్వంసాలు చేసి దాక్కుంటారు. తరువాత వాటి నష్టం సామాన్యజనం నెత్తిన పడుతుంది. మరి చేసిన వారి నెత్తిన పడదా అంటే "కష్టపడి సంపాదిస్తేనే కదా విలువలు తెలిసేది! వాళ్ళవి అడ్డగోలు సంపదనలే కదా!
సామజిక పుటలలో మనం ఎంత మొత్తుకున్నా, మొరపెట్టుకున్నా ఉపయోగంలేదు. మాపేజిలో 5 లక్షలమంది ఉన్నారు, మాపేజిలో 10లక్షల మంది ఉన్నారు అంటే ఉపయోగం ఏంటి? కామెంట్ లు, లైక్ లు, షేర్ లు వస్తాయి తప్ప నిజానికి ఉపయోగం శూన్యం. రాజకీయ నాయకుల సభలకు వెళ్ళిన ప్రజల వలె ఉంటుంది పరిస్థితి. చూసినవారికి ఆహా ఓహో నావెంటే జనం, ఇక ప్రభంజనం అనుకుంటారు. కాని విషయంలో ఫలితం శూన్యం.
ఈ లుచ్చా నాయకులు, కుల మతాలతో కొట్టుకుచచ్చేవారు ఉన్నంతకాలం, వీరిని నిలదీయడానికి సామాన్య జనానికి ధైర్యం లేనంతకాలం పరిస్థితి ఇంతే! ఒక్కమాట నోరుజారి ఎవరైనా అంటే కులం, మతం, సామజిక వర్గం, అంటూ హోరెత్తిస్తున్నారు. రచ్చరచ్చ చేస్తున్నారు. ఇదేనా ముందుతరాలకి మనం నేర్పించే పాఠం?

No comments:

Post a Comment