Saturday, 12 March 2016

కృత-త్రేతా-ద్వాపర-కలి యుగాలు

కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపి ఒక మహాయుగం. ఈ మహాయుగాన్ని మూడు భాగాలుగా విభజించారు.
కృతయుగం : ఈ యుగంలో పుణ్యాత్ములు, మహాత్ములు మాత్రమే ఉంటారు. వీరికి వేల లక్షల సంవత్సరాల ఆయుష్షు ఉంటుంది.
త్రేతా ద్వాపర యుగాలు : ఈ రెండు యుగాలు మధ్యస్థులు ఉంటారు. అంటే తమలో తమకి కలహాలు ఉన్నా ప్రజలకి ఇబ్బంది రాకుండా చూస్తారు. ఒకవేళ ఇబ్బంది వస్తే నారాయణుడు జన్మించి ఇబ్బందులు పెట్టేవారిని సంహరిస్తాడు.
ఇక కలియుగం : ఈ యుగం క్రూరాత్ములకి నిలయం. క్రూరాత్ములు అంటే క్రూరంగా అలోచించి చెడ్డపనులు, పాపాలు చేస్తూ ఉంటారు. మంచి చెడుతో సంబంధం లేదు. తల్లి తండ్రి.కూతురు కోడలు, భర్త, స్నేహితుడు అనే తేడాలు ఉండవు. మంచి మానవత్వం ఉండవు. చిన్నా పెద్ద తారతమ్యాలు ఉండవు. మనసుకి ఏది నచ్చితే అదే చేస్తారు తప్ప తప్పు ఒప్పులు చూడరు.
ఈవిధంగా యుగాలు నడుస్తాయి అని దేవి భాగవతంలో రెండవ స్కంధం వివరిస్తుంది. ఇలాంటి కలియుగంలో తరించాలి అంటే ఒక్కటే మార్గం చూపిస్తుంది. హరి నామ స్మరణ. నారాయణ. మాధవ, హరి అని భక్తితో మనస్పూర్తిగా స్మరిస్తే సకల పాపాలు తొలగిపోతాయి.
ఇక్కడ అతితెలివిగల వారికి ఒక సందేహం వస్తుంది. ఇంతకుముందు ఇలాంటిదే ఒక టపా పెట్టినప్పుడు ఒక సందేహం లేవనెత్తారు. ఎన్ని పాపాలు చేసినా దైవనామ స్మరణ చేస్తే సరిపోతుందా? ఎన్ని పాపాలు చేసినా రుద్రాక్ష శవం మీద వేస్తె సరిపోతుందా అని.. మనస్పూర్తిగా దైవనామస్మరణ చేయడం అంటే క్రూరాత్ములు చేయలేరు. ఎంతో పుణ్యం చేసుకుని ఇతరులకి మంచి చేయాలి అనే ఆలోచన గలవారే చేయగలరు తప్ప పాపాలు చేస్తూ మనస్పూర్తిగా భక్తితో ఉండలేరు. నామస్మరణ చేయలేరు. పాపాలు చేసి చేసి చనిపోయాక రుద్రాక్ష ఆ శవం మీద లేదా శవం క్రింద ఉన్నా దాని అర్థం అంతర్లీనంగా ఉంటుందే తప్ప అందరికీ అర్థమయ్యే విధంగా ఉండదు. ధర్మసూక్ష్మాలు మన తెలివికి అందవు.

No comments:

Post a Comment