చురుకత్తివో
సబర్మతి గీతానివో!
వెన్నెలవో
ఉదయించేడి క్షత్రియ తేజానివో!
నీ కాటుక కళ్ల సింగారాలను
ఏమని వర్ణింతునే సఖి.
ముచ్చటైన రూపం
నిండైన ఆత్మవిశ్వాసం
ముద్దులిడే ధరహసం
వసివాడని చిరు సోయగం.
రాజుల రాజరికాన్ని
పవనిజపు పౌరుషత్వాన్ని
అణువణువునా కనబరిచే
మధురమైన స్నేహ పరిమళం.
చిరుజల్లుల తాకిడిలో
పసిపాపల కేరింతలలో
స్త్రీ మూర్తుల ఔన్నత్యంలో
మట్టి వాసనల ప్రకృతిలో
ఉదయించిన ఓ నవ యవ్వన
నారీ తేజమా...
అందుకో మా ఈ అక్షర నీరాజనం
అరవిరిసిన నీ కన్నులు కలువలై ఉప్పొంగ!
అంది అందని నీ అందం
సిరిగంధమై చెలరేగంగ
దీవేనల్ హరిహారాది బ్రహ్మాదుల రక్షగన్.
జయోస్తు
విజయోస్తు.
సబర్మతి గీతానివో!
వెన్నెలవో
ఉదయించేడి క్షత్రియ తేజానివో!
నీ కాటుక కళ్ల సింగారాలను
ఏమని వర్ణింతునే సఖి.
ముచ్చటైన రూపం
నిండైన ఆత్మవిశ్వాసం
ముద్దులిడే ధరహసం
వసివాడని చిరు సోయగం.
రాజుల రాజరికాన్ని
పవనిజపు పౌరుషత్వాన్ని
అణువణువునా కనబరిచే
మధురమైన స్నేహ పరిమళం.
చిరుజల్లుల తాకిడిలో
పసిపాపల కేరింతలలో
స్త్రీ మూర్తుల ఔన్నత్యంలో
మట్టి వాసనల ప్రకృతిలో
ఉదయించిన ఓ నవ యవ్వన
నారీ తేజమా...
అందుకో మా ఈ అక్షర నీరాజనం
అరవిరిసిన నీ కన్నులు కలువలై ఉప్పొంగ!
అంది అందని నీ అందం
సిరిగంధమై చెలరేగంగ
దీవేనల్ హరిహారాది బ్రహ్మాదుల రక్షగన్.
జయోస్తు
విజయోస్తు.
No comments:
Post a Comment