ఒకరు కన్ను, ఒకరు చూపు కాదు . ,
కనులు చూపే మధురస్వప్నం ప్రేమంటే . . !
కనులు చూపే మధురస్వప్నం ప్రేమంటే . . !
ఒకరు మాట, ఒకరు భావం కాదు . ,
మాటలకందని భావం ప్రేమంటే . . !
మాటలకందని భావం ప్రేమంటే . . !
ఒకరు తప్పు, ఒకరు ఒప్పు కాదు . ,
ఒక్కటిగా కలిసుండే సర్దుబాటు ప్రేమంటే . . !
ఒక్కటిగా కలిసుండే సర్దుబాటు ప్రేమంటే . . !
ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు . ,
ఒక్కటవ్వాలనుకునే మక్కువ ప్రేమంటే . . !
ఒక్కటవ్వాలనుకునే మక్కువ ప్రేమంటే . . !
ఒక నువ్వు, ఒక నేను కాదు . ,
ఒక్కటయ్యే మనం ఈ ప్రేమంటే . . . !
ఒక్కటయ్యే మనం ఈ ప్రేమంటే . . . !
No comments:
Post a Comment