Wednesday, 16 March 2016

అందమైన నా ఈ కలల ప్రపంచాన్ని........

అందమైన నా ఈ కలల ప్రపంచాన్ని నా కల్ల ముందుకు తెచ్చే
తోడు కోసం వేచి ఉన్నాను ఇన్నాళ్ళు....
నా కలల ప్రపంచాన్ని ఇంకా అందంగా తీర్చి దిద్ధుతాననే
నమ్మకం కలిగించావు ఈ నాడు...
నన్ను తన గుండెల్లో పెట్టుకొనె వాడి కోసం ఎదురు చుశాను ఒక నాడు....
తన ప్రాణమే నేనైపోయాను ఈ నాడు...
నా ఇష్టాలకి విలువ నిచ్చి నా కస్టాలలో తోడై ఉండే
జీవిత బాగస్వామి కోసం వెతికాను ఒక నాడు...
నా ఇష్ట్తమే తన ఇష్టంగా కష్టాల నీడ కూడా పడనివ్వని
తోడు దొరికింది ఈ నాడు...
జీవితాంతం ఆనందంగా ఉండడం ఒక వరం అనుకున్నాను ఇన్నాళ్ళు....
జీవితం అంటేనే ఆనందం అని తెలిసేలా చెశాడు ఈ నాడు...
ఈ జన్మకి చాలు ఈ వరం అనుకున్నాను ఆ నాడు...
ఏడెడు జన్మలకి కావలి అనిపిస్తుంది ఈ నాడు....

No comments:

Post a Comment