ఎలా కలిసావో కదా..
ఇప్పటికీ ఒక అద్భుతమే !
వాస్తవంలోంచి స్వప్నాల్లోకి
స్వప్నాలనుండి లక్ష్యానికి
చేయిపట్టుకుని నడిపిస్తుంటే
మళ్లీ పుట్టినట్లు- కొత్తగా
నీ స్పర్శ లేకపోయినా
జీవితం గడిచేదా ? అంటే
ఏమో !
సమాధానంలా వచ్చి
ఎన్నో ప్రశ్నల్ని మిగిల్చావు.
జీవితం గడిచేదా ? అంటే
ఏమో !
సమాధానంలా వచ్చి
ఎన్నో ప్రశ్నల్ని మిగిల్చావు.
నువ్వు పక్కనున్నప్పుడు కూడా
నీ జ్నాపకాల్లో తిరుగుతూ
నీ ప్రతినవ్వునీ ప్రతీ నడకనీ
నెమలీకలాగా
మనసుపుటల్లో భద్రంగా.. !
నీ జ్నాపకాల్లో తిరుగుతూ
నీ ప్రతినవ్వునీ ప్రతీ నడకనీ
నెమలీకలాగా
మనసుపుటల్లో భద్రంగా.. !
నీ కన్నీటినీ చూశాను
నీ కోపాన్నీ అనుభవించాను
నీవల్ల నాకే తెలీని నాలోని మృదుత్వాన్ని
కనుగొన్నాను.
నీముందు నేనెంత చిన్నవాడినో తెలుసుకున్నాను.
నీ కోపాన్నీ అనుభవించాను
నీవల్ల నాకే తెలీని నాలోని మృదుత్వాన్ని
కనుగొన్నాను.
నీముందు నేనెంత చిన్నవాడినో తెలుసుకున్నాను.
నిన్నెప్పుడూ ప్రేమిస్తూనేవుంటాను
మా ఊళ్లో సముద్రంలా..!
నువ్వు వద్దన్నా సరే
ప్రేమగా నీ పాదాల్ని అభిషేకిస్తుంటాను.
మెత్తటి ఇసుకలో నీ పాదాలముద్రల్ని
నా హృదయంలో అపురూపంగా దాచుకుంటాను.
మా ఊళ్లో సముద్రంలా..!
నువ్వు వద్దన్నా సరే
ప్రేమగా నీ పాదాల్ని అభిషేకిస్తుంటాను.
మెత్తటి ఇసుకలో నీ పాదాలముద్రల్ని
నా హృదయంలో అపురూపంగా దాచుకుంటాను.
ఇదంతా నీకు ముఃఖతా చెప్పొచ్చు
అలా చెప్పలేకపోవడం నా అహం కాదు !
ఒక అద్భుతమైన కళాఖండం
శీతాకాలంలో తొలి సూర్యకిరణాలు
వర్షం కురిసాక కొండల్ని ముద్దాడే మేఘాలు-
వీటిని చూసినా నేను మాట్లాడలేను !
నువ్వూ అంతే నాకు !!
అలా చెప్పలేకపోవడం నా అహం కాదు !
ఒక అద్భుతమైన కళాఖండం
శీతాకాలంలో తొలి సూర్యకిరణాలు
వర్షం కురిసాక కొండల్ని ముద్దాడే మేఘాలు-
వీటిని చూసినా నేను మాట్లాడలేను !
నువ్వూ అంతే నాకు !!

No comments:
Post a Comment