Sunday, 27 March 2016

ప్రేమ - విలువలు?

ప్రేమకోసం మీ ఏడుపులు ఏంటి? పెడబొబ్బలు ఏంటి? క్లాసులు పీకడం, పీకిన్చుకోవడం ఏంటి? ఇంట్లో మిమ్మల్ని పట్టించుకోనన్నారా? పెళ్లి చేయను అన్నారా? ఎందుకు మీకన్ని తిప్పలు? ప్రేమించడం, చావడం, చంపడం ఎందుకీ దరిద్రం?
చదివేవి అర్థంపర్థం లేని చదువులు. విలువలు సున్నా! ప్రేమ సున్నా! కేవలం కామం మాత్రం 100%.. అందంగా ఉన్న అమ్మాయి లేక అబ్బాయి కనబడితే చాలు వెంటపడడం. ప్రేమించడం తిరగడం, చిన్నచిన్న కారణాలతో విడిపోవడం, చంపడం లేదా చావడం, లేదంటే మందు కొట్టి పడుకోవడం, ఒకటే ఏడుపు, 24 గంటలు వారి గురించే ఆలోచించడం బాధపడిపోవడం.. జీవితం అంటే ఇదొక్కటేనా!

అమ్మా నాన్న చిన్ననాటి నుండి పెంచి పెద్దచేసి మంచి విద్యావంతులని చేయాలని అప్పులు కోసం తిప్పలు పడైన సరే అప్పులు చేసి చదివిస్తుంటే, ఇక్కడ దేన్నో తగులుకోవడం.. అసలు లైఫ్ అంటే!

పెళ్లీడు వచ్చేవరకు చదువులు, ఉద్యోగాలతో పోటీపడి, ఏదైనా సాధించాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. ఆక్రమంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అంతేతప్ప లక్ష్యం కోసం పెళ్లి లేదు తల్లి లేదు, పెళ్ళాం లేదు అంటే జీవితం నాశనం అయ్యేది నీదే! కొన్నాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకుని తల్లిదండ్రులనే తిడతారు. ఇది ప్రస్తుతం జరుగుతుంది. నేను చూశాను. చూస్తున్నాను. ఒకతను ఉన్నాడు. నలభై ఏళ్ళు వచ్చాయి. పెళ్లి వయస్సులో నేను సాధించకే చేసుకుంటాను అన్నాడు. ఎన్నో సంబంధాలని ఛీ తు అన్నాడు.. వరదల్ల వచ్చిన సంబంధాలు జల్లుగా మారాయి. ఇప్పుడు జల్లు కూడా లేక ఎడారి అయ్యింది. అంటే ఒక్కటి కూడా రావడం లేదు. దీంతో "ఆరోజు నేను ఎదో ఒద్దు అని మాట వరసకి అన్నాను. అందుకని చేయరా! తిట్టో కొట్టో చేయాలి గాని ఊరుకుంటారా! పైపెచ్చు వచ్చిన సంబంధాలన్నీ మీరే చెడగొట్టారు" అని తెగ తిడుతున్నాడు.ఊర్లో అందరితో తల్లిదండ్రులని చులకన చేసి మాట్లాడుతున్నాడు.

లక్ష్యం ఎంత ముఖ్యమో జీవితం అంతకంటే ముఖ్యం. పొతే రాదు. లక్ష్యాలు మారిపోతూ పోతూ ఉంటాయి కానీ జీవితం తరిగిపోతూ ఉంటుంది. ఇది అక్షర సత్యం.

అలాగే ప్రేమతో కూడా జీవితాన్ని ముడి వేయకూడదు. ఒకరు మనకి దక్కలేదు అంటే అంతకంటే మంచివారు మన జీవితంలోకి వస్తారు. ఇది నావిషయంలో జరిగింది. రవి అనే స్నేహితుడు ఉండేవాడు. చిన్ననాటి నుండి జంటకవులు అని పేరు మా ఇద్దరికీ.. అలాంటిది వాడు చనిపోయాడు. చాలా బాధపడ్డాను. కానీ కొన్నాళ్ళలో అదేపేరుతో వాడికంటే మంచి స్నేహితుడు దొరికాడు. ఇది నేను కోరని ఊహించని బంధం. ఎలా కనెక్ట్ అయ్యాం అనుకుంటే ఇప్పటికీ జవాబులేదు. ప్రతికష్టంలో అతను వెంట నిలబడ్డాడు. నిలబడుతూనే ఉన్నాడు. ఒక్కడు కాదు ఇద్దరు దొరికారు. ఇద్దరూ అద్భుతాలే. అందుకే ఏ ఒక్కరితోనూ జీవితాన్ని ముడి వేసుకోకూడదు. నాకొక స్నేహితురాలు ఉండేది. చిన్నమాటే పట్టుకుని మాట్లాడడం మానేసింది. బాధపడ్డాను ఒక రెండురోజులు. కాని తెలుసుకదా! వీళ్ళు వెళ్ళడమే తప్ప రారు. బ్రతిమలడాను. వినలేదు. నచ్చచెప్పాను వినలేదు. అసలు ఎం తప్పు చేశాను? ఏమన్నాను? చెప్పు అంటే చెప్పలేదు. ఇలా ఉండగా మరొకరు పరిచయం అయ్యారు. ఆవిడకంటే మంచి స్నేహితురాలు. అపార్థం చేసుకోండి.. కేవలం స్నేహితురాలు మాత్రమే! ఒకరిది బెంగుళూరు అయితే మరొకరిది హైదరాబాద్. ఈరోజుల్లో ఇలాంటి స్నేహితులు దొరకడం కూడా అరుదే. ఎందుకంటే భక్తి ఉంది ఇద్దరిలో.. దీంతో మంచితనం పాళ్ళు కూడా ఎక్కువే ఉంది. సాయం చేసే గుణం ఉంది..

స్నేహం ప్రేమ, ఏదైనా కావచ్చు.. ఏ ఒక్కరికోసమో జీవితాన్ని ఆపకూడదు. ఆపుతూ వెళ్ళకూడదు. ఎందఱో ఎదురవుతూ ఉంటారు. వస్తూపోతూ ఉంటారు. అందరు మనతోనే ఉండాలి అనుకోవడం అంత పెద్దపోరబాటు మరొకటిలేదు. ఎవరి జీవితం వారిది. ఎవరి ఆలోచనలు వారివి. మన చుట్టూ ఉన్నవారిని మనం ఎంత బాగా చుసుకున్నామో అదే ముఖ్యం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. అమ్మానాన్న అక్కాచెల్లి, అన్నాతమ్ముడు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులు వీరందరినీ ఒక్కరికోసం త్యజించడం ఎంతవరకు న్యాయం? ఆలోచించండి.. అలాగే మీజీవితంలో ఎన్ని పొందబోతున్నారో మీరు ఊహించగలరా! లేదు. కొంతకాలం బాధ కలిగిందని ఏడుస్తూ కూర్చుంటే నీజీవితమే ఒడిదుడుకుల పాలౌతుంది. అందరూ బాగానే ఉంటారు. కాకపోతే నీకోసం 4 రోజులు ఏడుస్తారేమో తప్ప జీవితకాలం ఏడవరు.. ఇది మాత్రం గ్యారెంటీ..

No comments:

Post a Comment