Saturday, 12 March 2016

కర్ణుడి కథ

కర్ణుడు : యితడు మహాదాత అని పాండవుల కంటే గొప్పవాడని మనలో ఒక భ్రమ ఏర్పడిపోయింది. అసలు కర్ణుడు ఏమి చేశాడు?
దుర్వాస మహర్షి ఒకప్పుడు కొంభోజ దేశం (ప్రస్తుతం కంభోదియా) వచ్చినప్పుడు కుంతీ ఆయనకి సపర్యలు చేసింది. సపర్యలకు మెచ్చి దుర్వాసుడు అడగకుండానే ద్రౌపటికి "నువ్వు ఎవరిని కోరితే వారు వచ్చి నీ అభీష్టాన్ని నెరవేరుస్తారు." అని ఒక వరం ఇచ్చాడు.అప్పటికి ద్రౌపతి పడుచు ప్రాయంలో చంచల మనస్తత్వంతో ఉండడం వలన ఉదయిస్తున్న సూర్య భగవానుడి కిరణాలను చూసి దుర్వాసుడు ఇచ్చిన మంత్రాన్ని పఠించింది. వెంటనే సూర్యుడు వచ్చి బాలా ఏమి నీకోరిక అనగానే "దుర్వాసుడు ఇచ్చిన మంత్రం ఎలా పనిచేస్తుందో అని ఒకసారి ఉచ్చరించాను. అంతేతప్ప మరే ఉద్దేశ్యం లేదు అన్నది. సూర్యుడు "ఇది దుర్వాసుడి మంత్రం యొక్క మహిమ వచ్చిన కార్యం పూర్తీ కాకుండా తిరిగి వెళ్ళడం కుదరదు అని తన కిరణాల్ని కుంతీదేవి గర్భంలో ప్రవేశపెట్టి నెలలు నిండేవరకు రహస్యంగా కాపాడి పిదప కర్ణుడు జన్మించగానే ఒక పెట్టెలో పెట్టి నదిలో వదలమని చెప్పి బంగారపు నగలు ఉన్న బంగారపు పెట్టెను ఇచ్చాడు. అలా నీటిలో కర్ణుడిని వదలగానే అది కొట్టుకుంటూ వెళ్లి సూతుడి దొరుకుతుంది. అ అపెట్టేను తీసుకెళ్ళి తన భార్య అయిన రాధాదేవికి ఇచ్చాడు. అలా సూత సుతుడు, రాధా సుతుడు కనుక రాధేయుడు అయ్యాడు.
కౌరవులు పాండవులతో పాటు విద్యాభ్యాసం చేసాడు. అకారణంగా అర్జునుడి మీద పగ పెంచుకున్నాడు. బ్రహ్మాస్త్రం సాధించాలి అని పట్టుబట్టాడు. ద్రోణుడి వద్దకు వెళ్లి ఉపదేశించమని అడుగగా ఎంతో నియమ నిష్టలు ఉంటే తప్ప బ్రహ్మాస్త్రం ఉపదేశించరాదు కనుక నీకు ఉపదేశం చేయడం కుదరదు అన్నాడు. ద్రోణుడు తన కొడుకు అయిన అశ్వత్థామకు కూడా బ్రహ్మాస్త్రం ఉపదేశం చేయలేదు. ఎందుకంటే అశ్వత్థామ ఆవేశపరుడు. కోపం వస్తే ఎలా స్పందిస్తాడో కూడా తెలియదు. భారత యుద్ధం ముగిసిన తరువాత శివుడి అంశతో అందరిని సంహరించిన అశ్వత్థామ పాండవులు తనను ఏమైనా చేస్తారేమో అనే భయంతో తాను కాపాడుకోవడం కోసం పాండవుల భార్యల గర్భాలలో, పాండవుల వారసుల గర్భాలలో ఉన్న శిశువులతో సహా "అపాండవం అవ్వు గాక!" అని బ్రహ్మశిరోనామకాస్త్రం సంధించాడు. కాని ఉపసంహారం తెలియదు. శ్రీకృష్ణుడు ఉపసంహారం ఉపదేశిస్తాను ఉపసంహరించు అని బ్రతిమలాడినా వినలేదు. అంతటి మూర్ఖుడు అశ్వత్థామ. అందువల్ల కొడుకుకి సైతం నేర్పని బ్రహ్మాస్త్రం అదే స్థాయిలో అనవసరపు పగతో ప్రజ్వరిల్లుతున్న కర్ణుడికి కూడా ఉపదేశించలేదు.
అర్జునుడి మీద ప్రేమతో నాకు బ్రహ్మాస్త్రం ఉపదేశించలేదని తనలో తాను ఊహించుకొని పరశురాముడి వద్దకు వెళ్లి "నేను బ్రాహ్మణుడిని" అని అబద్దం చెప్పి బ్రహ్మాస్త్రం ప్రయోగ ఉపసంహార విధులు నేర్చుకున్నాడు. ఒకనాడు సాధన చేస్తూ ఉండగా అక్కడికి దగ్గరలో ఉన్న ఒక బ్రాహ్మణుడు తన యజ్ఞాలలో, హోమాలలో పంచద్రవ్యాల కోసం పోషిస్తున్న హోమధేనువుకి కర్ణుడు ప్రయోగించిన బాణం తగిలి చనిపోయింది. ఆ అంబారావం విన్న బ్రాహ్మణుడు బయటికి వచ్చి చూసి కర్ణుడిని "ఎందుకు బాణం వేసి ఈ హోమధేనువుని చంపావు? అని నిలదీస్తే "ఇక్కడ పరశురాముడి ఆశ్రమం ఉందని నీకు తెలియదా! అయన దగ్గరికి విద్యలు నేర్చుకోవడానికి విద్యార్థులు వస్తారని, విద్యలు అభ్యాసం చేస్తూ ఉంటారని బాణాలు తగులు తాయని తెలియదా? అని పొగరుగా సమాధానం చెబుతాడు. ఆ సమాధానానికి కోపగించిన బ్రాహ్మణుడు "నీవు యుద్ధం చేసేటప్పుడు క్లిష్ట పరిస్థితులలో ఉండగా నీరథ చక్రం భూమిలో క్రుంగిపోవుగాక! తల తెగి మరణింతువు గాక! అని శపించాడు.
విద్యాభ్యాసం దాదాపు ముగిసిన తరువాత ఒకరోజు పరశురాముడు అలసిపోయి కర్ణుడి తొడ మీద తల పెట్టి పడుకున్నాడు. ఇంతలో ఒక రాక్షసుడు పురుగు రూపంలో వచ్చి కర్ణుడి తోడ తొలుస్తూ ఉండగా రక్తం కారి నిద్రిస్తున్న పరశురాముడికి తాకుతుంది. తడి తగలడంతో మెలకువ వచ్చిన పరశురాముడు ఏమి జరిగింది అని కర్ణుడిని ప్రశ్నించగా "ఒక పురుగు నా తొడ తొలచింది. మీకు నిద్రాభంగం కలుగకూడదు అని భరించాను." అన్నాడు. వెంటనే పురుగుని కోపంతో చూడగానే నశించిపోయి మానవ రూపం ధరించి పరశురాముడికి తన కథను వివరించి వెళ్ళిపోతుంది. అనంతరం నువ్వు ఎవరో నిజం చెప్పు. బ్రాహ్మణుడికి ఇంత శక్తి ఉండదు. అని తన దివ్యదృష్టితో చూసి, నిజం చెప్పు అని అడుగగా "నేను సూత పుత్రుడిని" బ్రహ్మాస్త్రం కోసం మీ వద్ద చేరాను. ద్రోణుడిని బ్రహ్మాస్త్రం ఉపదేశించమని అడుగగా ఎంతో నియమ నిష్ఠలు ఉండాలని చెప్పాడు. కేవలం క్షత్రియుడికే ఉపదేశిస్తాను అని అన్నాడు. అందువలన మీకు అబద్దం చెప్పి ఉపదేశం పొందాను" విద్య నేర్పే గురువు ఎ గోత్రం వాడైతే శిష్యుడు కూడా అదే గోత్రం వాడు అవుతాడు. అని దిక్కరించాడు. కర్ణుడు బ్రహ్మాస్త్రం ఎందుకు పొందాడో తన దివ్యదృష్టితో చూసిన పరశురాముడు ఆగ్రహించి "కర్ణుడు బ్రాహ్మణుడిని, భృగువంశ గోత్రోద్భవుడిని అని రెండు అబద్దాలు చెప్పి బ్రహ్మాస్త్రం ఉపదేశం పొందినందుకు, అర్జునుడిపై అకారణ ద్వేషం పెంచుకున్నందుకు, దానివలన భవిష్యత్తులో తలత్తే సమస్యలకు "యుద్ధ సమయంలో నువ్వు బ్రహ్మాస్త్ర ప్రయోగ మంత్రం మర్చిపోదువు గాక! అని శపించాడు. కర్ణుడు తాను చేసిన తప్పుకు ఏమాత్రం జంకకుండా పొగరుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
అభ్యాసం పూర్తి చేసుకొని దుర్యోధనుడి వద్దకు వచ్చిన కర్ణుడు దుర్యోధనుడికి "తాను నేర్చుకున్న విద్యలు శాపం వలన నశించాయి అని, యుద్ధ సమయంలో రథం క్రుంగుతుంది అని నిజమూ చెప్పలేదు. అలాగని అబద్దం చెప్పలేదు. అభ్యాసం పూర్తీ చేసుకొని వచ్చాను. ఇక నాముందు అర్జునుడు బలాదూర్ అన్నాడు. ఎప్పుడూ పాండవులను నాశనం చేయాలి అనే కోరికతో ఉండే దుర్యోధనుడికి అగ్నికి ఆజ్యం తోడైనట్లు కర్ణుడి మాటలు కొత్త ఉత్సాహాన్ని రేపాయి. తిరుగులేదు అనుకున్నాడు.
ఒకనాడు దుర్యోధనుడు ఏకాంతంలో ఉండగా శకుని పాండవుల మీద అకారణ ద్వేషం పెంచుకున్తున్నావు. అది మంచిది కాదు అని చెబుతూ ఉండగా అదే సమయంలో కర్ణుడు వచ్చి గోవులను కాపాడాలి అనే వంకతో మనం ఘోశాయత్రకి వెళ్లి పాండవులని మట్టు బెడదాం అని శకుని మాటలకి ఊరుకున్నవాడిని కాస్త రెచ్చగొట్టి ఘోషయాత్రకి వెళ్లారు. అక్కడ గంధర్వుడి చేతిలో చావు దెబ్బలుతిని సైన్యంతో సహా కర్ణుడు అక్కడి నుండి పారిపోయాడు. దుర్యోధనుడు గంధర్వుడి చేతికి చిక్కగా కళ్ళు చేతులు కట్టి లాక్కేళుతూ ఉండగా ఈ విషయం ధర్మరాజుకి తెలిసి ఆర్జునుడిని పంపిస్తాడు. అప్పుడు గంధర్వుడితో భీకరమైన పోరాటం చేసి దుర్యోధనుడిని విడిపిస్తాడు. దుర్యోధనుడు ధర్మరాజు వద్ద వీడ్కోలు తీసుకొని వెళ్ళతాడు. రెండురోజుల తరువాత కర్ణుడు దుర్యోధనుడి వద్దకి వచ్చి ఆరోజు గంధర్వుడికి శక్తి ఎక్కువగా ఉండడం వలన ఓడించాలేకపోయాను ఇప్పుడు వస్తే అంతు చూస్తా! అంటూ మళ్ళి బీరాలు పలుకుతాడు. మళ్ళి ఉప్పొంగుతాడు దుర్యోధనుడు.
అరణ్యవాసం ముగిసి అజ్ఞాత వాసం కూడా ముగిసిన తరువాత (అప్పటికి కౌరవులకి అరణ్య అజ్ఞాత వాసం గడువు లెక్క తేలలేదు.) దక్షిణ గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం పేరుతొ భీష్మ ద్రోణ, కర్ణ, దుర్యోధన వంటి మహా యోధులు అందరూ వెళతారు. ఉత్తర గోగ్రహణం సమయానికి గడువు ముగిసిన పాండవులకు విషయం తెలిసి గోవుల్ని కౌరవుల నుండి రక్షించడం కోసం యుద్ధానికి బయలుదేరుతుంటే అర్జునుడు అందరిని ఆపి నేను ఒక్కడిని చాలు నాతొ ఉత్తరకుమారుడిని మాత్రం పంపించండి అంటే సరేనని విరాట మహారాజు అలాగే పంపిస్తాడు. అర్జునుడు రథికుడిగా, ఉత్తర కుమారుడు సారధిగా వెళ్లి "కౌరవ సైన్యాన్ని ఊచకోత కోసి, భీష్ముడితో సహా అందరిని చావు దెబ్బలు కొట్టి, కర్ణుడిని ప్రత్యేకించి వెంటపడి మరీ కొట్టి తరుముతాడు. అర్జునుడి దెబ్బలకి తాళలేక ఒకప్పుడు ఘోషయాత్రలో, ఇప్పుడు ఉత్తర గోగ్రహణంలో దుర్యోధనుడిని వదిలేసి పారిపోయాడు. అయిన దుర్యోధనుడు కర్ణుడిని నమ్మడం మానలేదు. కర్ణుడు ఆర్జునుడిని అది చేస్తా, ఇది చేస్తానని బీరాలు పలకడం మానుకోలేదు.
కుంతీదేవి ఒకనాడు కర్ణుడి వద్దకు వెళ్లి నువ్వు నా కుమారుడివి పాండవులతో కలిసి జీవించు అని ప్రాదేయపడితే "ఆర్జునుడిని తప్ప పాండవులలో ఎవరినీ చంపను" అని అడగని వరం ఒకటి కుంతీదేవికి ఇచ్చాడు.
కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయ్యే ముందు రోజు ఎవరు ఏమి చేయాలి అనే సమావేశంలో కర్ణుడిని అర్థ రథుడిగా భీష్ముడు ప్రకటిస్తాడు. నేను అర్థ రథుడిని ఏంటి? నాకేమి తక్కువ? అంటూ భీష్ముడిని అధిక్షేపించగా అర్జునుడి చేతిలో జరిగిన పరాభవాలు ఏకరువు పెట్టి తనకు మించిన పనిని సాధ్యం అవుతుంది అని చెప్పడం నీకే చెల్లింది అని అంటాడు భీష్ముడు. అది తట్టుకోలేక నువ్వు పడిపోయేవరకు నేను యుద్ధం చేయను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడ యుద్ధం సమయంలో దుర్యోధనుడికి చేయిచ్చాడు. పదవ రోజు భీష్ముడు పడిపోయాక కర్ణుడు యుద్ధం చేస్తాడు. తనని కవచకుండలాలు అర్థించడం కోసం ఇంద్రుడు వస్తున్నాడు అని తెలిసిన కర్ణుడు ఇంద్రుడు రాగానే నువ్వు అడిగింది ఇస్తాను. కాని నాకు శక్తి అనే ఆయుధం కావాలి ఇవ్వమని అడుగుతాడు. సరేనని ఇంద్రుడు కవచకుండలాలు తీసుకొని శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు. ఏది ఆశించకుండా ఇచ్చేదే దానం. ఎదో ఆశించి దానం చేస్తే ఫలితం ఉండదు. అలాగే జరిగింది. అర్జునుడి మీద వేయాల్సిన శక్తి అనే ఆయుధాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగిస్తాడు. శక్తి అనే ఆయుధం తగలడంతో ఘటోత్కచుడుమరణిస్తాడు.
ఘటోత్కచుడు మరణించడంతో శ్రీకృష్ణుడు రథం దిగి నాట్యం చేస్తూ ఉండగా పాండవ శిబిరంలో వారు ఆశ్చర్యంతో శ్రీకృష్ణుడిని చూస్తూ ఉంటారు. ఘటోత్కచుడు మనవాడు.పైగా మహావీరుడు. అతడు చనిపోతే నువ్వెందుకు నాట్యం చేస్తున్నావు?అని అర్జునుడు ప్రశించగా కృష్ణుడు నవ్వి! అర్జునా! ఈరోజుకర్ణుడి చేతిలో ఈ ఘటోత్కచుడు చనిపోకపోతే ఆ శక్తి అనే ఆయుధానికి నువ్వు బలయ్యేవాడివి. అంతేకాదు ఘటోత్కచుడుభీముడి కుమారుడే అయి ఉండవచ్చు. కాని అతడి తల్లి రాక్షసి. కనుక యితడు రాక్షసుడే. ఈరోజు ఘటోత్కచుడుకర్ణుడి చేతిలో మరణించకపోయినా ఎదో ఒకరోజు నేనే ఇతడి కోసం అవతరించవలసిన అవసరం వచ్చేది. ఈకరణాల వలన నేను నాట్యం చేశాను అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు.
భీముడు చేసిన ఒక ప్రతిజ్ఞ "దుష్యాసనుడి రొమ్ము చీల్చి రక్తం త్రాగుతాను" అంటూ నిండు సభలో శపథం చేసాడు. వీరుడిని అని చెప్పుకుంటున్న కర్ణుడు చూస్తూ ఉండగా, భయంకర ఆకృతి దాల్చి దుశ్యాసనుడి గుండెలు చీల్చి రక్తం త్రాగుతాడు. కర్ణుడు ఆ ఉగ్రరూపనికి కంపించి చేష్టలుడిగి చూస్తూ ఉన్నాడే తప్ప ఏమి చేయలేకపోయాడు.
ఇక చివరిరోజు కర్ణుడు చనిపోయే ఘట్టం. రథచక్రం భూమిలో క్రుంగుతుంది. ఆర్జునుడిని రథికుడు కనివాడి మీద బాణాలు వేయకూడదు అంటూ నీతులు చెబుతూ అర్జునుడు బాణాలు ఎక్కడ వేస్తాడో అని భయపడుతూ ఒక ప్రక్క రథ చక్రం భుజంతో లేపుతూనే మరోప్రక్క అర్జునుడి మీదకి బాణాలు వేస్తూ ఉంటాడు. రథికుడు కాని వాడి మీద బాణ ప్రయోగం చేయకూడదు అన్నావు. అభిమన్యుడు ఒక్కడిని చేసి విరథుడిని చేసి నువ్వు చేసిన పని ఏమిటి? అబిమన్యుడి ముందు నిలువలేక వెనుక నుండి వెళ్లి ధనుస్సు విరిచినవాడివి నువ్వు కాదా! విరథుడై ఒంటరిగా పోరాడుతున్న వాడిపై మూకుమ్మడిగా బాణాలు ప్రయోగించడం ధర్మమా! పోనీ నన్ను బాణాలు వేయకు అంటూనే నువ్వు నామీద అస్త్రాలు సందిస్తున్నావు. ఇది ధర్మమా! అని ఒక్క ధనస్సుతో తల త్రుంచి వేస్తాడు అర్జునుడు. ఇక్కడితో కర్ణుడు కార్యం పూర్తయింది. తాను గొప్ప మిత్రుడిని అని చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూ, ఎవ్వరినీ లెక్కచేయక, లేక్కచేయనీయక నిలువెల్లా దుర్యోధనుడిని ముంచాడు. దుశ్యాసనుడిని రెచ్చగొట్టి ద్రౌపతీ వస్త్రాపాహారం సమయంలో వస్త్రాలు వోలిపించడానికి ముఖ్య కర్త అయ్యాడు. చేసిన పాపాలకి తగిన మూల్యం చెల్లించుకున్నాడు.
ఇన్ని ఘోరాలు చేసిన కర్ణుడు ఇప్పటి యువతకి ఆదర్శప్రాయుడు అయ్యాడు. పాండవుల కంటే గొప్పవాడిగా మారిపోయాడు నేటి యువతకి.. ఇది అసలు భారతంలోని కర్ణుడి అసలు కథ.

10 comments:

  1. GREAT STORY IN HISTORY
    AN UNFORGETTABLE STORY

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Veedevado half mind gadu telisindi sunna, ilanti fake rayaku teliyakapothe musukoni kurcho, karnudini or ekalavyunni arjunudu eppatiki gelavaledu, darmam vypu vundadam valana krishnudu kapadadu

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. Matya yantram - Ghosha Yatra - Uttara Gograhanam - Abhimanyuni maranam ..satyam yemito ..local languages loo kakunda Vyasudu samsktutam loo yemi vrasaadoo ..telusukoovaali ...Appudey prayojanamuntundi..🙏🌹🌼🙏

    ReplyDelete