"నా.........న్న......." ఈ పిలుపు నువ్వు పిలిచినప్పుడు..
పొత్తి కడుపులో నుంచి ఏదో.... ఆనందమో... మైకమో....... తెలియదు కానీ...అలలా తన్నుకొస్తే, "ఇదిగో నేను సాదించాను అని ప్రపంచాన్ని గర్వంగా చూసాను "
పొత్తి కడుపులో నుంచి ఏదో.... ఆనందమో... మైకమో....... తెలియదు కానీ...అలలా తన్నుకొస్తే, "ఇదిగో నేను సాదించాను అని ప్రపంచాన్ని గర్వంగా చూసాను "
నీకు తెలియదురా.. నాన్నా.... ను నా చిటికెన వేలు గట్టిగా పట్టుకున్నప్పుడు... నా గుండెల ఫైన కూర్చొని నా మీసాలతో ఆడుకుంటూ ఉంటె ఎంత సంబర పడ్డానో......
నిన్ను చూడటానికి వచ్చినవాళ్లు "కళ్ళు, ముక్కు నాన్నవే " అంటుంటే ఎంతగా పొంగిపోఎవాన్నో...
ను బడికి పోవడం మొదలు పెట్టినప్పుడు నా కొడుకు ఎ డాక్టరో ఇంజినీరో అవ్వాలని కలలు కన్నా...
ను ఒక్క్కో క్లాస్ దాటుతున్నప్పుడు నేను నాటిన విత్తనం మహవ్రుక్షమ్ అవుతుందని సంబర పడ్డాను.
పరిక్షల్లొ నీకు మంచి మార్కులు వచ్చాయని అప్పు చేసి మరీ మా ఆఫీస్ లో పార్టీ ఇచ్చాను.
నీకు పుట్టిన రోజు వస్తే నెల రోజుల ముందు నుంచే డబ్బులు పోగు చేసేవాన్ని నా కొడుకుకి మంచి గిఫ్ట్ కొనివ్వాలని .
నీకు జ్వరం వస్తే , అది తగ్గే వరకు నేను మీ అమ్మ ఉపవాసాలు ఉండేవాళ్ళం. నరకం చూసేవాళ్ళం.
ను కాలేజీ లో చేరినప్పుడు......
నీకు బైక్ కావాలని మీ అమ్మ తన గాజులు అమ్మి నీకు బైక్ కొనిచ్చింది. కాలేజీ లో న కొడుకు ఎవ్వరికన్నా తక్కువ కాకూడదు అని నేను ఎన్నో ఖర్చులు , అవసరాలు తగ్గించుకుని నీకు డబ్బులు పంపించేవాన్ని. మీ అమ్మకి కొత్త చీర కొన్ని ఎన్ని ఇయర్స్ అయిందో....
ఇప్పుడు ను పెద్దవాడివి అయ్యావు... ఉద్యోగం వచ్చింది అని .. పెళ్లి కూడా చేసుకున్నావని విన్నాను...
నిన్ను, నీ కొడుకుని చూడాలని మీ అమ్మ ఆశపడుతుంది. వాడు పెద్దవాడు అయ్యాడు
వాడికంటూ ఓ జీవితం ఉందంట.. ,, మనల్ని దగ్గరఉంచుకుని చూసుకునే అంత తీరిక వాడికి ఉండదంట అని చెప్తే ఈ ముసలి వయసు లో మీ అమ్మ విని తట్టుకోలేదురా..... నాన్నా....
వాడికంటూ ఓ జీవితం ఉందంట.. ,, మనల్ని దగ్గరఉంచుకుని చూసుకునే అంత తీరిక వాడికి ఉండదంట అని చెప్తే ఈ ముసలి వయసు లో మీ అమ్మ విని తట్టుకోలేదురా..... నాన్నా....
నేను ఆపుకున్నట్లు మీ అమ్మ ఏడుపుని ఆపుకోలేదు కదా......
నాన్న... ఇప్పుడు నీకూ ఓ కొడుకు ఉన్నాడు. జాగ్రత్త నాన్న.....
ఇట్లు
......................
వృధ్యాప్యం లో అసహాన స్తితిలో మీనాన్న
......................
వృధ్యాప్యం లో అసహాన స్తితిలో మీనాన్న
కంటి లో నీరు మనస్సు లో భాద
ReplyDeleteమనం అపినా ఆగదు ఏదో రూపంలో కనిపిస్తుంది
చాల అద్బుతంగా రాశారు సార్