Wednesday, 16 March 2016

స్వచ్ఛత.....?

నా దృష్టిలో తల్లి పాల తర్వాత
అంత స్వచ్ఛమైనది మన "కన్నీరు"....
పొట్ట చెక్కలయ్యేలా నవ్వినా కన్నీళ్ళే వస్తాయి, 
గుండెలవిసేలా వెక్కి వెక్కి ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి ....
జీవితంలో గొప్ప స్థాయికి చేరినా కన్నీళ్ళే వస్తాయి, 
అధపాతాళానికి పడిపోయినా కన్నీళ్ళే వస్తాయి ....
మర్చిపోలేని సంఘటన చూసినా కన్నీళ్ళే వస్తాయి,
దారుణంగా మోసపోయినా కన్నీళ్ళే వస్తాయి ....
మనం భూమి మీదకు అడుగుపెట్టినప్పటి నుండి
మన శరీరాన్ని కాల్చి లేదా పూడ్చే వరకూ
మన నుంచి ఏమీ ఆశించకుండా మనతో పాటు
మన కన్నుల్లో కాపురముండేదే " కన్నీరు "....
(అదేంటో , ఇది రాస్తున్నా కన్నీళ్ళే వస్తున్నాయి) ..

1 comment:

  1. మీ యొక్క కవితా లకి జోహర్ సార్

    ReplyDelete